ఆత్మకూర్(ఎం) జనవరి 21 (జనంసాక్షి) సర్వేపల్లి గ్రామం నుండి పుల్లయిగూడెం గ్రామం వరకు బునదిగాని పనులు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తమ సొంత నిధులతో శరవేగంగా బునదిగాని కాల్వ పనులు జరిపిస్తున్నారు ఆత్మకూర్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాల రైతుల కోసం బునదిగాని కాలువ ద్వారా నీళ్లు వచ్చి పంట పొలాలు పచ్చగా ఉండాలని పనులు చేస్తున్నందుకు ఆత్మకూరు మండలం రైతులందరూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులు కుంటలు బునదిగాని కాలువ ద్వారా నిండే అవకాశం ఉంది బునదిగాని కాలువకు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే కాలువను అనుసంధానం చేస్తున్నందుకు మన మండల రైతులకు పంట పొలాలకు మంచినీళ్లు త్వరలో వస్తున్నందుకు భవిష్యత్తులో రైతుల కలలో ఆనందంతోపాటు పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉన్నద నీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోరే బిక్షపతి గారు రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ లగ్గాని రమేష్ గౌడ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మేడి వెంకన్న గ్రామ శాఖ అధ్యక్షులు కోర వెంకన్న మాదస్వామి వెంకట్ రెడ్డి బీరప్ప శ్రీశైలం నర్సింహ తదితరులు పాల్గొన్నారు




