వేపల సింగారంలో తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు
– రక్త దానం మహా దానం – జన చైతన్య ట్రస్ట్ హుజూర్ నగర్ డిసెంబర్ 9 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణానికి చెందిన జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వేపల సింగారం గ్రామంలో సర్పంచ్ అన్నేం శిరీషకొండారెడ్డి ఆధ్వర్యంలో “తల సేమియా” బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం ఖమ్మం సంకల్ప తలసేమియా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై కట్టా వెంకట్ రెడ్డి, సర్పంచ్ అన్నెం శిరీషకొండారెడ్డి, జనచైతన్య ట్రస్ట్ వంశీతో పాటు 40 మంది బ్లడ్ డోనర్ల ద్వారా రక్త సేకరణ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా అనే వ్యాధి మనిషి రక్తం పై తన ప్రభావాన్ని చూపిస్తుందనీ శ్వాసక్రియల ద్వారా తీసుకునే ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ హిమోగ్లోబిన్ అందిస్తుందన్నారు. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదనీ ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదనీ వారికి తిరిగి 15నుండి 30 రోజుల్లో మళ్ళీ రక్తం ఎక్కించాలిందిన అవసరం వుంటుంది. కనుక ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. హుజూర్ నగర్ పరిసర ప్రాంతాలలో రక్తం అవసరం ఉన్న దాదాపు 350 పైగా పేషంటులకు ఇప్పటివరకు జనచైతన్య ట్రస్ట్ వారు రక్తదానం చేయడం జరిగిందని, ఆపదలో ఉన్న వారికి రక్త దానం చేయడం కంటే మించిన దానం ఉండదని, ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జనచైతన్య ట్రస్ట్ సభ్యుల కృషి అభినందనయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ గౌరవధ్యక్షులు సులువ చంద్రశేఖర్, అధ్యక్షులు పారా సాయి నాయుడు , ఉపాధ్యక్షుడు పిల్లి.శివశంకర్ , సెక్రటరీ దగ్గుబాటి రమేష్, జయంత్, అహ్మద్, ఎస్.నవీన్, శ్రీపతి,డి.నవీన్ రాజు, సీత, కిరణ్ , సాయి తదితరులు పాల్గొన్నారు.
వేపల సింగారంలో తలసేమియా బాధితుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు




