Tuesday, 3 November 2026

వేలం గడువు పెంచండి

న్యూడిల్లీ: టెలికం స్పెక్ట్రమ్‌ వేలం పాట గడువును మరికొంతకాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో 122 టెలికా లైసున్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆగస్టు 31 లోగా స్పెక్ట్రమ్‌ కేటాయింపులకు కొత్తగా వేలం నిర్వహించాలని కూడా కోర్టు ఆదేశించింది. 122 లైసెన్సులను రద్దు చేసినప్పటికీ సెప్టెంబరు 7వరకు వాటి కార్యకలాపాలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. ఈ పరిస్థితుల్లో వేలం గడువు పొడిగించాలని కోరుతూనే ఇతరత్రా ప్రభావిత అంశాలను కూడా ప్రభుత్వం తన అభ్యర్థనలో ప్రాస్తావించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *