Tuesday, 3 November 2026

ఆరు గ్రానైట్‌ కంపెనీలపై కేసు

మదురై: మదురై జిల్లా మేలూరు తాలూకా పరిధిలో వెలుగుచూసిన ఆక్రమ గనుల వ్యవహారంలో ఆరు గ్రానైట్‌ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి ఎం.కే.అళగిరి కుమారుడు దురై దయానిధి భాగస్వామిగా ఉన్న ఒలంపస్‌ గ్రానైట్‌ కంపెనీ కూడా ఉంది. ఒలంపన్‌ కంపెనీ రూ.547 కోట్ల విలువగల గ్రానైట్‌ని నిబంధనలకు వ్యతిరేకంగా వెలికితీసిందని తేల్చారు. దీంతో దురై దయానిధితోపాటు ఆయన వ్యాపార భాగస్వామి నాగరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *