Tuesday, 3 November 2026

వేసవి శిబిరాలు విద్యార్థులకు ఉపయోగకరం ఐతోల్ సర్పంచ్ సింగిరెడ్డి.ఇందుమతి నరసింహారెడ్డి…

నాగర్ కర్నూల్ ఆర్సీ మే 02(జనంసాక్షి):వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఐతోల్ సర్పంచ్ సింగిరెడ్డి.ఇందుమతి నరసింహారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం తాడూర్ మండలం ఐతోల్ గ్రామంలో”మనగుడి-మనబడి”అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.గ్రామ ఆలయ ప్రాంగణంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,గ్రామంలోని విద్యార్థులకు వేసవి శిబిరంలో ప్రత్యేకంగా ఆటపాటలు ఫిజికల్ ఫిట్నెస్ ఈవెంట్స్,కూచిపూడి నృత్యం భవద్గీత ప్రత్యేక తరగతులు నిర్వ హించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.వాటితోపాటు ఆటలు,పాటలు,కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిబిరం తరగతులు ఉంటాయని చెప్పారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మల్కేకేడి హుస్సేన్ జీ,ఎస్ పి సి కార్యదర్శి దుర్గం.ప్రసాద్ గౌడ్ గ్రామ పెద్దలు యువకులు విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.