Tuesday, 3 November 2026

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిది

కాప్రా జవహార్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 2:-. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిరుపేద కుటుంబాల అభ్యున్నతి కోసం ఎంతగానో వినియోగపడుతున్నాయని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ ప్రాంతంలో గల శ్రీరామ్ నగర్ కాలనీ నివాసితులైన జి అంకిత్ S/o జి ధర్మేందర్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయి చికిత్స పొంది కోలుకోవడం జరిగింది. ఇట్టి విషయాన్ని డివిజన్ కార్పొరేటర్ సతీష్ కుమార్ దృష్టికి తీసుకోవడంతో తక్షణమే స్పందించి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సహాయ సహకారంతో బాధితుడైన అంకిత్ కుమార్ కి సీ.ఎం. రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు అన్ని విధాల కృషిచేసి మంగళవారం కార్పొరేటర్ సతీష్ కుమార్ చేతుల మీదుగా 49,000 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు