Tuesday, 3 November 2026

సింగ‌రేణి బ‌హుముఖ ప్ర‌గ‌తికి ద‌ర్ప‌ణంగా సంస్థ క్యాలెండ‌ర్‌

సింగ‌రేణి బ‌హుముఖ ప్ర‌గ‌తికి ద‌ర్ప‌ణంగా సంస్థ క్యాలెండ‌ర్‌……

సింగ‌రేణి భ‌వ‌న్ లో సంస్థ వార్షిక క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ లో

జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేష్…

సింగ‌రేణి సంస్థ సాధిస్తున్న బ‌హుముఖ ప్ర‌గ‌తికి, సంక్షేమానికి, సేవ‌ల‌కు ద‌ర్ప‌ణంగా సింగ‌రేణి వార్షిక క్యాలెండ‌ర్ -2023 ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని, దీనిని సింగ‌రేణి లోని ప్ర‌తి ఉద్యోగికి పంపిణీ చేస్తున్నామ‌ని జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (కో ఆర్డినేష‌న్) ఎం.సురేశ్ అన్నారు. హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో సోమ‌వారం ఉద‌యం సింగ‌రేణి నూత‌న క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించి ప్ర‌సంగించారు.

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు గ‌త రెండేళ్లుగా క్యాలెండ‌ర్‌ను ప్ర‌చురించ‌లేద‌ని, అయితే గ‌త నెల‌లో ఈ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి క్యాలెండ‌ర్ల ప్ర‌చుర‌ణ‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చింద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశానుసారం అతి త‌క్కువ స‌మ‌యంలోనే సింగ‌రేణి ప్ర‌గ‌తి, సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాల చిత్రాల‌ను పొందుప‌రుస్తూ క్యాలెండ‌ర్ల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు.

క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ జీఎం(మార్కెటింగ్‌) కె.సూర్య‌నారాయ‌ణ‌, అధికారుల సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.వి.రాజ‌శేఖ‌ర‌రావు, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ మిర్యాల రాజిరెడ్డి త‌దిత‌రులకు అంద‌జేశారు. కార్యక్రమం
లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ ఎన్‌.భాస్క‌ర్, అన్ని విభాగాల అధిప‌తులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు…….జనం సాక్షి