Monday, 2 November 2026

హుజూర్ నగర్ కు మంత్రివర్యులు కేటీఆర్ వస్తున్నందున సభాస్థలి పరిశీలన

హుజూర్ నగర్ కు మంత్రివర్యులు కేటీఆర్ వస్తున్నందున సభాస్థలి పరిశీలన
హుజూర్ నగర్ జనవరి 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం హుజూర్ నగర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకుల బృందం జనవరి 6వ తారీఖున జరగబోయే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు పర్యటనలో భాగంగా నిర్వహించబోయే బహిరంగ సభకు కావలసినటువంటి సభాస్థలిని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గట్టు వద్ద బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె ఎల్ ఎన్ రెడ్డి( డాక్టర్), అట్లూరి హరిబాబు, మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు జక్కుల శంబయ్య, లైబ్రరీ చైర్మన్ పిన్నేని సంపత్, వార్డు అధ్యక్షులు దొంతి రెడ్డి నవీన్ రెడ్డి, మలిదశ ఉద్యమకారుడు ఎడ్ల విజయ్, యువ నాయకులు అలవాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.