Thursday, 5 November 2026

శ్రీ గౌతమి హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం

శ్రీ గౌతమి హై స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 14

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో 14వ నవంబరు బాలల దినోత్సవంను పురస్కరించుకొని పట్టణములోని శ్రీ గౌతమి హై స్కూల్ లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.పాఠశాల ప్రిన్సిపాల్ జాధవ్ రాందాస్ బాలల దినోత్సవం ప్రముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా గౌరవ అధ్యక్షుడు జాధవ్ పుండలిక్ రావు ,పర్యవేక్షకులు సుదీప్ సుత్రావే ,విశాఖ, శైలజ ,క్రాంతి,గంగుతాయి , ఉపాధ్యాయులు ,పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.