వైభవోపేతంగా ఆదివరాహ స్వామి శతఘటాభిషేకం- దిగ్విజయంగా ముగిసిన వరాహస్వామి

జయంతోత్సవాలు జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజులపాటు ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. కమాన్పూర్ మండలమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివరాహస్వామిని దర్శించుకున్నారు. చివరి రోజైన మంగళవారం ఆదివరాహ స్వామి కి శతఘటభిషేకాన్ని వైభవంగా వేద పండితుల వేద మంత్రుత్సవాల మధ్య నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుగంటి ప్రేమలత జగన్నాధ రావు తో పాటు పాలకవర్గ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివరాహ స్వామి జయంతోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.