Wednesday, 4 November 2026

వైభవోపేతంగా మరియమ్మ ఉత్సవాలు

వైభవోపేతంగా మరియమ్మ ఉత్సవాలుకాప్రా జవహార్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 28:-   మారియమ్మ తల్లి కృపా కటాక్షంతోనే మల్కారం ప్రజలందరం ఆయురారోగ్య ఐశ్వర్య సుప్రశాంతులతో జీవనం సాగిస్తున్నామని మారియమ్మ వారి చల్లని దీవెనలే మాకు శ్రీరామరక్ష అని పివిఎం రమేష్ పివిఎం జగన్ పివిఎం శ్రీనివాసులు అన్నారు మల్కారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న మారియమ్మ దేవాలయం వద్ద అంబరాన్ని అంటే సంబరాలతో ఐదు రోజులపాటు నిర్వహించే అమ్మవారి ఉత్సవాలను పివిఎం రమేష్ పివిఎం జగన్ పివిఎం శ్రీనివాస్ మరియు బంధుమిత్రుల సమక్షంలో అమ్మవారి వేడుకలలు వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పివిఎం రమేష్ మాట్లాడుతూ ఏటేటా మా ఇంటి దేవత అయినటువంటి మారియమ్మ వారి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో మామిడి ఆకులు తోరణాలతో నానా విధములైన పూల మాలలతో అలంకరించి ఐదు రోజులపాటు అమ్మవారికి ఇష్టమైన మేళ తాళాల ధ్వనులతో బ్రాహ్మనోత్తముల వేద మంత్రోచ్ఛరణలతో కలశారాధన పూజలు చండీ హోమాలు అగ్ని గుండాలు ఏర్పాటుచేసి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ధ్యానిస్తూ భక్తులు అగ్నిగుండాలు తొక్కే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం చివరి రోజు అమ్మవారికి మేకపోతులను బలిచ్చి ప్రతి ఇంటి నుండి కోటి దీపాల కాంతుల మధ్య బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇష్ట నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపాకటాక్షాలు పొందడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో నరసింహతో పాటు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు