వైభవోపేతం.. మున్నూరు కాపుల కార్తీక వనభోజనోత్సవం
– హాజరైన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్
– వేలాదిగా వచ్చిన కాపు కుల బాంధవులు
– ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వరంగల్ ఈస్ట్, నవంబర్ 20(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని మై మాస్టర్ స్కూల్ పక్కన మామిడి తోటలో ఆదివారం మున్నూరు కాపుల కార్తీక వనభోజనం ఉత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపని నరేందర్ దంపతులు హాజరయ్యారు వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఉత్సవాలలో నగరంలోని 24 డివిజన్లకు చెందిన వేలాది మంది మున్నూరు కాపు బిడ్డలు కుల బాంధవులు హాజరై వనభోజనాలను మొట్టమొదటిసారిగా అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కాకతీయుల రాజధాని అయిన వరంగల్ ఇప్పుడు వరంగల్ జిల్లాగా మారిందన్నారు వరంగల్ తూర్పులో కాపులు అధిక జనాభా ఉన్నారని వాళ్ళ కోసం ఏడాదిలోగా మున్నూరుకు కాపు భవన నిర్మాణం చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మున్నూరు కాపులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అదేవిధంగా తనను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరారు రాజకీయాలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు మున్నూరు కాపులంతా ఐకమత్యంగా ఉండి కుల అభివృద్ధి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే కోరారు నియోజకవర్గంలో కాపులకు ఉన శక్తి ఎవరికీ లేదనిఅందరం కలిసి మెలిసి ఉంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో మధుప్రియ మధుప్రియ ,మౌనిక ,గంగ, శంకర్ తదితరులు ఆలపించిన పాటలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ఇంద్రసేన కూడా హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి, కెడల జనార్ధన్, పెంచాలా గోపన్న, ఓగిలి శెట్టి అనిల్, మేడిది మధుసూదన్ ,కుందారపు రాజేందర్, గడ్డం రమేష్, సోమిశెట్టి ప్రవీణ్, సిద్ధం రాజు, పల్లం పద్మ, ముష్క మల్ల సుధాకర్ శ్రీదేవి, ఆకుతోట శిరీష్, కెడల,పల్లం రవి, పద్మ, మేడిది రజిత, డాక్టర్ హరి రమాదేవి, ఉషశ్రీ, మర్రి రవి, బోరిగం నాగరాజు, శంకేసి శంకర్రావు, వలిశెట్టి సుధాకర్, కమటం వేణుగోపాల్, నాయిని అశోక్, బోరిగం నర్సింగం ,బండి చక్రపాణి ,బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఆనందమోహన్ , బండారి రమేష్, మిట్టపల్లి కట్టమలు, నీలం రాజ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు




