రఘునాథ పాలెం ఫిబ్రవరి 01 జనం సాక్షి YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి తుంపాల కృష్ణమోహన్ ఆధ్యర్యం లోఖమ్మం నగరంలో బుధవారం ఖానాపురం హవేలీ కొలిపాక ఫంక్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్ టిపి విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్ఆర్ టిపి నాయకులు పాల్గొని మాట్లాడారు . రాజన్న పరిపాలన రావాలంటే షర్మిలమ్మ అధికారంలోకి రావాలని అప్పుడే మన జీవితాలు మారుతాయి అని , వైఎస్ఆర్ కాలంలో ఎంతో మంది ఆయన పేరు చెప్పుకుని లబ్ది పొందారని అన్నారు . తెలంగాణ గడ్డ ఉద్యమాల ఖిల్లా అని టిఆర్ఎస్ ను బొంద పెట్టి ఖమ్మంలో బీఆర్ఎస్ జాతర మొదలుపెట్టారని కుట్లు లో రాయి తీయలేని వాళ్ళు ఏట్లో రాయి ఏం తీస్తారని ప్రశ్నించారు . షర్మిలమ్మ తెలంగాణ బిడ్డ పాలేరు అమ్మ మన షర్మిలమ్మ . ఆల్ పార్టీలు కలిసి పాలేరు లో పోటీ చేసిన విజయం మన వైయస్సార్ టీపిదే అన్నారు . నూటికి నూరుశాతం పాలేరు నియోజకవర్గమంతా షర్మిలమ్మ వెంటే . ఉంటుందన్నారు . టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ను దూరం చేశారని , వైయస్సార్ పార్టీకి చివర తెలంగాణ అని తగిలించుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రూపురేఖలు దిద్దుకుందని అన్నారు . బిజెపి బీఆర్ఎస్ పార్టీ దొండు దొండే అని ఆ రెండు పార్టీలు ఒకటే అని షర్మిలమ్మను తిట్టే అర్హత బిజెపి గాని బీఆర్ఎస్ కు కాని లేదన్నారు . నీటి నిజాయితీతో కూడిన పార్టీ మన వైఎస్ఆర్ టిపి పార్టీని . జరుగుతున్న అన్యాలను , అవినీతిని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ మన షర్మిలమ్మ . ప్రత్నియ్య పార్టీలకు ఎదురుగా నిలబడి దీటుగా సమాధానం చెప్పే సత్తా షర్మిలమ్మకే సాధ్యపడిదని పేర్కొన్నారు . షర్మిలమ్మ ప్రస్థానంలో ఎన్నో అడ్డంకులు కలిగించి తప్పుడు కేసులు పెట్టిన అదేర పడకుండా ముందుకు సాగిందని తెలిపారు . ప్రజల పక్షణా పోరాడే గొంతుగా షర్మిలమ్మన్నారు . వైయస్సార్ టిఫి పార్టీని విస్తృత స్థాయిలో తీసుకెళ్లడానికి కార్యకర్తలు , నాయకులు నిస్వార్థతో పని చేయాలని పిలుపునిచ్చారు . రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామ్ రెడ్డి , ఏపూరి సోమన్న, నీలం రమేష్, గడిపల్లి కవిత, లక్కినేని సుధేర్, రవీంద్ర రెడ్డి, బాణోత్ సుజాత , దొంతమాల కిషోర్ కుమార్, మద్దెల ప్రసాద్, మేకమల్ల సందీప్, కంది వెంకట రెడ్డి, ధర్మసోత్ రాము నాయక్, తుమ్మా అప్పిరెడ్డి, ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, ఆలస్యం రవి , యాకా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు




