Monday, 2 November 2026

5న కేసిఆర్ నాందేడ్ రాక జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్

 

 

 

 

 

జుక్కల్, పిబ్రవరి 1, (జనం సాక్షి),
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి బిఆర్ఎస్ ఆదినేత ముఖ్య మంత్రి కేసిఆర్ ఈ నెల 5న వస్తున్నారని జహిరాబాద్ ఎంపి బీబీ పాటిల్తెలిపారు. ఆయన నాందేడ్ లో బుధవారం మీడియా సమావేశం మాట్లాడారు. కేసిఆర్ ముందుగా గురుద్వారా పుణ్య క్షేత్రం సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. ఆనంతరం ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలకుపూల మాలలు వేసి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.ఈ సభలో ముఖ్యంత్రి కేసిఆర్ సమక్షంలో పెద్దయెత్తున మహారాష్ట్ర ప్రముఖులు,ప్రతినిధులు చేరనున్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఎమ్మెల్ల్యేలు బాల్క సుమన్, షకీల్ అమీర్, సివిల్ కార్పోరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.