Tuesday, 3 November 2026

వైయస్సార్ తెలంగాణ పార్టీ కోటిపల్లి మండల శాఖ అధ్యక్షునిగా నారాయణరెడ్డి నియామకం

వికారాబాద్ రూరల్ జూలై 2 జనం సాక్షికోటిపల్లి మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నారాయణరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ నియామక పత్రం అందజేశారు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటిపల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి రాబోయే ఎన్నికల్లో అంకితభావంతో పనిచేసే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రామ గ్రామాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య ప్రచారచన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ప్రజలకు వివరించి వైయస్సార్ తెలంగాణ పార్టీని బలోపేతం చేయడం ఎంతో అవసరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి ప్రసాద్ మహిళా అధ్యక్షురాలు రజిని యువజన విభాగం అధ్యక్షుడు వేణుగోపాల్ కోటపల్లి వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు వైయస్సార్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు