Tuesday, 3 November 2026

సంగారెడ్డి పాతబస్తీ మంచి నీటి సమస్యను తీర్చిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ 

 

 

 

 

 

;-సమస్య చెప్పినే వెంటనే ….  పరిష్కరించిండ్రు ..

;-చింతా  ప్రభాకర్  మాటకు పదునెక్కువ..

;-సంగారెడ్డి పాత బస్టాండ్ లో 0.3 టీఎంసీల మంజీర నీళ్ళు విడుదలకు ఆదేశాలు ..

;-సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 2  :===పాతబస్తీ మంచి నీటి సమస్యను  టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ దృష్టికి మున్సిపల్ చైర్మన్  మరియు వైస్ చైర్మన్లు తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించిన  చింతా ప్రభాకర్ ఆ  సమస్యను మంత్రితో మాట్లాడి అధికారులకు ఆదేశాలు జారీ చేయించి నీటి సమస్యను తీర్చారు.

సంగారెడ్డి పాత బస్టాండ్  వార్డులలో లో 0.3 టీఎంసీల మంజీర నీళ్ళు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.సంగారెడ్డి పట్టణంలోని 1,2,3,18,19,20,21, 22,23 వార్డుల్లో గత 3 రోజుల పాటు మంచి నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు

మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ లు TSHDC ఛైర్మెన్ చింతా ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సమస్యను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన మంత్రి నీటి ,సమస్యను  పరిష్కరించాలని  సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు సింగూర్ నుంచి మంజీరా లోకి,  నేడు 0.3 టీఎంసీల మంచి నీళ్ళు విడుదల చేయడం జరిగింది.నీళ్ల సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు గారికి చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్మన్,  వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు.