వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో వాగ్దేవి కాలేజ్ ఫ్రెండ్షిప్ డే వేడుకలు…….

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–

శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు, భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి నవీన్ కుమార్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ హాజరై ఫౌండర్ శ్రీ దరిపల్లి అనంతరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి సరస్వతీ దేవి ఆశీస్సులతో జ్యోతి ప్రజల చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీ దరిపల్లి నవీన్ కుమార్ గారు విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని దానిని సద్వినియోగం చేసుకోవాలని నేటి బాలలే రేపటి పౌరులని విద్యార్థులు మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ప్రయోజకులు అవుతారని శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా వాగ్దేవి జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగంలో మెడికల్ విభాగంలో మరియు డిఫెన్స్ విభాగంలో అన్నిట్లో మా విద్యార్థులు ముందున్నారని, విద్యార్థుల అభివృద్ధి మా లక్ష్యం అని అన్నారు. శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కోలను శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం అని ప్రతి విద్యార్థి పై శ్రద్ధ ప్రత్యేకమైన తీసుకొని విద్యార్థులకు మంచి మార్కులు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నవీన్ కుమార్ కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, కొలను శ్రావణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మహేందర్ , శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ యాకుబ్ గారు, శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల అధ్యాపకులు నరేందర్ రెడ్డి, వీరయ్య, రాజు, బిక్షపతి, ప్రియాంక,ఉషారాణి, రామకృష్ణ, హారిక, దీపిక, మాధవి, మొయన్, పరుశురాములు, తాడూరు మల్లేశం, స్రవంతి వాత్సల్య డిఫెన్స్ అకాడమీ నగేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.