వైసిపి నుంచి జారుకునే యత్నాల్లో ఎమ్మెల్యేలు
నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
అమరావతి,మార్చి4 ( జనంసాక్షి ) : వైసీపీ ప్రజా ప్రతినిధులపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారని వెల్లడిరచారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీజేపీ హయాంలో మందిర్, మసీదు మాత్రమే తెచ్చారని తప్పుబట్టారు. వ్యాపారస్తులు రాజకీయాలలోకి రావడం వల్లే అమరావతి కి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ మాట్లాడిన మాటలు చాలా దారుణమన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసే వారికే ఈ సారి టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. రాష్టాన్రికి అభివృద్ధి టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జరిగిందని తెలిపారు. ఓటుకు 50 వేలు ఇచ్చినా వైసీపీ ఈ సారి గెలిచే పరిస్థితి లేదని శివాజీ జోస్యం చెప్పారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని హక్కులను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ నిలదీశారు.