రంగారెడ్డి,నవంబర్11(జనంసాక్షి): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ఆదికారుల తనిఖీలు నిర్వహించారు. రియాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.12.22 లక్షల విలువైన 233.06 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వంగాల సైదులును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.17 లక్షల విలువైన 32 తులాల బంగారం, 55 తులాల వెండితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్‌లో బంగారం స్వాధీనం




