శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రూట్ విచారణ అధికారికి వినతి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కార్యదర్శి నాగపురి కిరణ్ కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో రూట్ ఎంక్వయిరీ అధికారి కి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా నాగపురి కిరణ్ మాట్లాడుతూ.. కరోనా కాలం ముందు శభాష్ గూడెం గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని కరోనా తర్వాత శభాష్ గూడెంకు కూడా గ్రామానికి బస్సు రాకపోవడం వల్ల విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారని వారు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాగపురి గ్రామంలో అనేక ధర్నా చేసిన అప్పటి నుండి విద్యార్థులను బస్సు సౌకర్యం కల్పిస్తామని తేనె పలుకులు పలికించి ధర్నా చేస్తున్న విద్యార్థులను మభ్యపెట్టి వారిని ధర్నా విరమించేలాగా హామీలు చెప్పి ఇప్పటివరకు కల్పించక కల్పించకపోవడంతో నేడు జనగామ రూట్ ఎంక్వయిరీ వినతి పత్రం సమర్పించారు. రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, కార్తీక్, భరత్, సాయి కృష్ణ, భాస్కర్, మధు, బాపురాజ్, అఖిల్, సామి తదితరులు పాల్గొన్నారు.