శశికాంత్‌ శర్మ నియామకంపై సుప్రీంలో పిల్‌ దాఖలు

న్యూఢల్లీి,(జనంసాక్షి): కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శశికాంత్‌ శర్మ నియామకాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. శశికాంత్‌ శర్మ నియామకం మార్గదర్శకాలకు విరుద్దంగా ఉందని ప్రశాంత్‌ భూషణ్‌ తన పిటిషన్‌లో  పేర్కొన్నారు. శశికాంత్‌ శర్మ ఇటీవలే కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.