: శామీర్ పేట్, జనంసాక్షి :శామీర్ పేట్ మండల పరిషత్ కార్యాలయం వద్ద దళిత సేన మండల అధ్యక్షులు వజ్జల మురళి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులకు 10 లక్షల రూపాయలతో మంత్రి మల్లారెడ్డి భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనలో అందరుభాగస్వాములు కావాలని అన్నారు.భవన నిర్మాణం లో నిధులు ఎన్ని అవసరమైన ఇస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దళిత సేన మండల అధ్యక్షులు వజ్జల మురళి, ఉపాధ్యాయులు బిక్షపతి, రాజు, డేవిడ్, ప్రధాన కార్యదర్శి బాలేష్, సాయికుమార్, వెంకటేష్, ప్రచార కార్యదర్శులు శ్రీకాంత్, శ్రీనివాస్, కోశాధికారి ఆంజనేయులు, పరశురాం, వీరేష్, శామ్, కాళిదాస్, బాబు, వెంకటేష్, ఆనంద్, పోచయ్య, కృష్ణ, యాదగిరి, గ్రంధాలయ ఛైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, ఎంపిపి ఎల్లుబాయి బాబు, జెట్పిటిసి అనిత లాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, జడ్పీ కో ఆప్షన్ జహీర్, రైతు బంధు అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఎంపీడీఓ వాణి శామీర్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విలసాగరం సుదర్శన్, గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 
శామీర్ పేట్ లో అంబేద్కర్ నూతన భవన నిర్మాణానికి శంఖు స్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి




