Tuesday, 3 November 2026

శావిూర్‌పేటలో బాలుడి కిడ్నాప్‌..హత్య

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ఈ నెల 15వ తేదీన శావిూర్‌పేటలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. శావిూర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతియాన్‌(5) అనే అబ్బాయి అదృశ్యమైన విషయం తెలిసిందే. అదే రోజు తమ అబ్బాయి కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం  ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతి కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.