హైదరాబాద్,(జనంసాక్షి): శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై ఇవాళ చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రివవవవ పితాని సత్యనారాయణ సమాధానమిచ్చారు. అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి చట్టం రావడం ఇదే తొలిసారి అని సీఎం తెలిపారు. సుదీర్ఘ చర్చ తర్వాతే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం రూపు దాల్చింది. అని చెప్పారు. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం 350 హాస్టళ్లు రైతు కూలీలను రైతులుగా మార్చేందుకు ఇందిరా జలప్రభ ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత ఎన్నికల కోసం కాదు అని సీఎం స్పష్టం చేశారు. అనంతరం శాసనమండలి రేపటికి వాయిదా పడింది.




