Tuesday, 3 November 2026

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే విపక్షాల ఆందోళనల మధ్య అరగంటపాటు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు. రైతు సమస్యలపై చర్చకు తెదేపా సభ్యులు డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *