Wednesday, 4 November 2026

శిల్పాకు క్షమాపణలు చెప్పిన రాజ్‌కుంద్రా

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి, రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని శిల్పాశెట్టికి ఆమె భర్త రాజ్‌కుంద్రా క్షమాపణలు చెప్పారు. శనివారం శిల్పా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో కుంద్రా క్షమాపణలతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన భార్య శిల్పాశెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీపై వస్తున్న అరోపణలపై క్షమాపణలు చెపుతున్న. నిజం త్వరలోనే బయటపడుతుంది’. అని ఐపీఎల్‌ బెట్టింగ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో కుంద్రా ట్వీట్‌ చేశారు. శిల్పాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బిగ్‌బీ అమితాబచ్చన్‌కు కుంద్రా కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *