Wednesday, 4 November 2026

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల  ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 25. (జనం సాక్షి.). సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎస్పి అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం. అనే రెండు అంశాల మీద  సైబర్ నేరాలు చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్  నేరం చేయడం జరుగుతుంది మరియు భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా  దోచేస్తున్నారు . మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయచ్చని తెలిపారు. జిల్లాలో వారం రోజుల్లో నమోదైన సైబర్ నెరాల వివరాలను వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల  వలలో పడకుండా ఉండాలని కోరారు.