అయోధ్య: శివుడే ముస్లింల మొదటి ప్రవక్త అని జమైత్ ఉలేమా ముఫ్తి ముహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ముస్లీంలందరూ సనాతన ధర్మాన్ని అనుసరించారని కూడా చెప్పారు. శివపార్వతులే మా సృష్టికర్తలనడం చర్చనీయాంశమైంది. భారత్‌ను ఓ హిందూ దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకించమని కూడా చెప్పారు.
చైనీయులున్న దేశాన్ని చైనా, జపనీయులు ఉన్న దేశాన్ని జపాన్ అని పిలిచినపుడు భారత్‌ను హిందుస్తానీగా పిలిస్తే తప్పేంటన్నారు. ఫిబ్రవరి 27 న ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్ లో జరగనున్న మత సామరస్య సదస్సుకు సాధువులను ఆహ్వానించడానికి జమైత్ ఉలేమా బృందం అయోధ్య వచ్చింది.




