హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ‘భూసార కార్డు’ పథకాన్ని ప్రారంభించారు. రైతులందరూ ఏటా భూసార పరీక్ష చేయించాలని పరీక్షలో వచ్చిన ఫలితా ఆధారంగా ఎరువులు వాడాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయంలో అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.




