Friday, 6 November 2026

శ్యాంప్రసాద్‌ రెడ్డికి సిఎం సంతాపం

హైదరాబాద్‌,జూన్‌18(జ‌నం సాక్షి):పుత్ర వియోగంతో బాధలో ఉన్న తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ (ట్రీ) ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. తుర్కయాంజల్‌ లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కుమారుడు డాక్టర్‌ విపిన్‌చంద్రారెడ్డి గుండెపోటుతో చనిపోయారు.