శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలి
జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు
కన్నెకంటి వెంకటేశ్వరాచారి
రామన్నపేట డిసెంబర్ 03 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ మండల అధ్యక్షుడు కన్నె కంటి వెంకటేశ్వర చారి డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా స్థానిక సుభాష్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలని సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తాసిల్దార్ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు ప్రభుత్వం వెంటనే నివారించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ జువెలరీస్ షాపుల మూలంగా ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మారోజు అనంతాచారి సంఘం జిల్లా కార్యదర్శి చోల్లేటి పాండురంగాచారి స్వర్ణకార సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు చోల్లేటి చంద్రశేఖరాచారి రామన్నపేట విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి శానగోండ వెంకటాచారి స్వర్ణకార సంఘం మండలం ప్రధాన కార్యదర్శి కాoజోజు శ్రీనివాసాచారి స్వణకార సంఘం మండల సహాయ కార్యదర్శి శ్రీరామోజు నరసింహాచారి నాయకులు కాoజోజు పాండురంగాచారి మారోజు రాఘవాచారి రామోజు బ్రహ్మచారి సూరోజు పాండురంగాచారి దశరథ చారి శానకొండ రామాచారి రామోజు నాగభూషణాచారి ఆకవరం ఉదయ్ అక్కిన పళ్లి చంద్రమౌళిచారి కాన్జోజు సైదులు చారి శాణగొండ శ్రవణ్ శానకొండ ధనంజయ మూసూజు నరేష్ కాన్జోజు వెంకటాచారి శుభకోటి శశికృష్ణమాచారి శుభకోటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




