శ్రీమేధా స్కూల్లో నమూనా ఎన్నికలు…
భైంసా రూరల్ డిసెంబర్ 03 జనం సాక్షి
కృత్యాధార విద్యని ప్రోత్సహించే విధంగా శ్రీ మేధా స్కూల్లో శనివారం నమూనా ఎన్నికలను నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికలఅధికారి విధులు,ఎన్నికలవిధానము, ఓటింగ్ ప్రక్రియ,అభ్యర్థుల పోటీ, ఓటర్స్ పాత్ర వంటి అంశాలపై కృత్యాలు నిర్వహి0చి, అవగాహన కల్పిస్తూ విద్యార్థులలో ఎలక్షన్స్ నిర్వహించారు.ఈ నమూనా ఎలక్షన్స్ కార్యక్రమానికి గోపాల్ రావు పటేల్ ప్రభుత్వడిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, వార్డ్ కౌన్సిలర్ చందులాల్, అడ్వకేట్ సాయినాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయినాథ్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమానంద్ ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు.




