Wednesday, 4 November 2026

హై జంప్ లో జాతీయస్థాయికి ఎంపికైన జోగ సుశీల

హై జంప్ లో జాతీయస్థాయికి ఎంపికైన జోగ సుశీల

టేకులపల్లి డిసెంబర్ 3( జనం సాక్షి ): ప్రభుత్వ జూనియర్ కళాశాల టేకులపల్లి లో చదువుతున్న జోగా సుశీల విద్యార్థిని రాష్ట్రస్థాయి 6 వ సొసైటీల లీగ్ ఆటల పోటీలలో పాల్గొని హై జంప్ భాగంలో రజత పథకాన్ని సాధించడమే కాక జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థినికి కళాశాల ప్రిన్సిపాల్ సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బి కృష్ణమూర్తి, బసవమ్మ, సత్యవతి, వేణుగోపాల్, ముంతాజ్ అలీ, యాకూబ్ వరలక్ష్మి శ్రీనివాసరావు కృష్ణమోహన్ ఉషశ్రీ సృజన చైతన్య మొదలైన వారు పాల్గొన్నారు.