Wednesday, 4 November 2026

సేవకు ప్రతిరూపంసేవకు ప్రతిరూపం యఫ్ టీవీ సీఈఓ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి.

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 25 ( జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలోని పేద ప్రజల కుటుంభాలకు కష్టం  ఉందంటే   నేనున్నానంటూ తన అభయహస్తాన్ని అందిస్తు  పేదవాళ్లకు దైవంగా  నిలుస్తున్నారు వీణవంక    యఫ్ టివి సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి.   మండల కేంద్రంతో పాటు నియోజవర్గంలోని  ఆయా గ్రామాలలో నా పేద ప్రజలకు  ఎవరికైనా ఎలాంటి కష్టం వచ్చినా  వారికి నేనున్నానంటూ   ముందుండి  పేద ప్రజలకు వారికి తోచిన కాడికి సహాయ సహకారాలు అందిస్తు  ప్రజలందరి మన్ననలు పోందుతున్నారు.  ఇటీవల మండల కేంద్రంలో ఇటీవల పలు వివాహాలు జరగగా బతకయ్య – ప్రమీల కుమార్తె కు. దాసరపు  మల్లయ్య- సారమ్మ కుమార్తెలకు మంగళవారం రోజున ఇరువురి  కుటుంబాలకు మా ఇంటి కానుక  కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతి కుటుంబానికి  యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులతో ఒక్కొక్క ప్రతి కుటుంబానికి.5000 ఐదువేల రూపాయల  ఆర్థిక సాయం అందజేశారు .వీణవంక  మండల కేంద్రానికి చెందిన   పాడి ఉదయ్ నందన్ రెడ్డి. నేను ఉన్నానంటూ ముందుకు వెళ్తున్నారు ఇటీవల  కొంతమంది పేద విద్యార్థులకు  ఎంబిబిఎస్ సీట్లు వచ్చిన వారికి  ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చిన వారికి  ప్రతి సంవత్సరం చదువుకునేందుకు వారికి లక్షల  ఫీజులు కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు  గతంలో కరోనా సమయంలో మండల కేంద్రం తోపాటు నియోజవర్గంలో పేద ప్రజలకు సుమారు 50 యాబై  లక్షల రూపాయల నిత్యవసర వస్తువులు  పేద వారికి తన వంతుగా సాయం చేసుకుంటూ  సహాయ సహకారాలు అందించుకుంటూ  గత కొన్ని సంవత్సరాలు తరబడి   ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు  సహాయ సహకారాలు అందజేస్తూ  పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తూ అర్హత సాధించిన విద్యార్థులకు  వారి అర్హతను బట్టి కొంతమందికి వీణవంకలో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కొంతమందికి హైదరాబాదులో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ  గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ ముందుకు కొనసాగుతూ  ముందుండి పేద  వారిని కాపాడుకుంటున్నారు   . ఈ కార్యక్రమం మాజీ జెడ్పిటిసి దాసరపు ప్రభాకర్. మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్. మండల కో ఆప్షన్  మెంబర్  అబ్దుల్  హమీద్.  అమృత ప్రభాకర్. నారాయణ. సమీళ్ల ప్రకాష్. మంతెన శ్రీధర్. తాళ్లపల్లి కుమారస్వామి. పస్తం  కుమార్  యఫ్ టీవీ సిబ్బంది.  తో పాటు తదితరులు పాల్గొన్నారు