–
జనం సాక్షి న్యూస్/ ఝరాసంగం:- ఎల్గోయి అభివృద్ధి రూ.కోటి మంజూరు; మంత్రి హరీష్ రావు సీడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ కోరిక మేరకు గ్రామ అభివృద్ధి నిధులు కేటాయించాలని అడగడంతో వెంటనె స్పందించిన మంత్రి హరీష్ రావు, గురువారం ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా 1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను సబ్ స్టేషన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల హాయంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక సమస్యలు మన ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చారన్నారు. మహిళలకు గృహలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు, యువత కోసం త్వరలోనే స్కిల్ డెవ లప్మెంట్ సెంటర్ ను ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు. ముందు గా మంత్రి మొక్కను నాటి నీరు పోశారు ఈ కార్యక్రమంలో సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, స్థానిక సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జగదీశ్వర్,,మాజీ అధ్యక్షుడు సంగమేశ్వర పాటిల్ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి, జగదీశ్వర్ పాటిల్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు మహిళలు పాల్గొన్నారు.




