వూరే లక్ష్మణ్ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి) న్యూస్ : శ్రీ వాసవి కన్యకపరమేశ్వరిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో సోమవారం వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వూరే లక్ష్మణ్ మాట్లాడుతూ వాసవిమాతకు పంచామృతాభిషేకం గణపతి పూజ, మంటపారాధన, అమ్మవారికి విశేషపూజలునిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సాముహికంగాశ్రీ లలితా సహస్రనామ పారాయణం , శ్రీ వాసవి మాత పారాయణములు నిర్వహించారు. 102 గోత్రీకులచే వాసవిమాత ఆత్మార్పణ మహోత్సవ యాగం(యజ్ఞం) నిర్వహించారు. వాసవిమాతకు మహిళలు వడిబియ్యం పోసి టెంకాయలు కొట్టి రవికలు, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో రేణిగుంట్ల గణేష్ గుప్తా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇరుకుళ్ళ రామకృష్ణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు, కాసం సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి, అగిరి వెంకటేష్ గుప్తా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా చైర్మన్, మాశెట్టి అనంత రాములు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, బండారు రాజా, గుండా బిక్షపతి, తెల్లాకుల వెంకటేశ్వర్లు, తాటికొండ సీతయ్య, మీలా వంశీ, గుండా శ్రీదేవి, తాళ్లూరి లక్ష్మీనారాయణ రాచకొండ శ్రీనివాస్ రావు, కొత్త లక్ష్మణ్ వీరవెల్లి శ్రీలత మరియు ఆర్యవైశ్య సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం




