శ్రీశైలానికి తగ్గిన వరదప్రవాహం

క్నూలు,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 21,121 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 879.80 అడుగులమేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటినిల్వ 187.70 టీఎంసీలున్నది.