Tuesday, 3 November 2026

శ్రీశైలం ఆరు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 5 గేట్లను 10 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు చేరుతున్న ఇన్‌ఫ్లో 1,68,000 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,49,000 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 213.8824 టీఎంసీలు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు. ప్రాజెక్టు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు నివేదిక వెల్లడించారు.