శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం,ఆగస్ట్16(జనం సాక్షి):ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 75,937 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికివస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 872.50 అడుగులు, నీటినిల్వసామర్థ్యం 152.1568 టీఎంసీలుగా నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్టుకు 2025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.