Tuesday, 3 November 2026

శ్రీశైల జగద్గురు పీఠాధిపతులకు స్వాగతం పలికిన వీరశైవ లింగాయత్ నాయకులు

 

సంగారెడ్డిలో నేడు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి

వీరశైవ లింగాయత్ నాయకులు

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 26  :   –

శ్రీ అది జగద్గురు పంచాచార్య  యుగమానోత్సవం , మరియు మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవం రోజైనా  మంగళవారం నాడు సంగారెడ్డి లో  జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సంగారెడ్డి విచ్చేయుచున్న శ్రీశైలం జగద్గురు  పీఠాధిపతులు  శ్రీమద్ శ్రీశ్రీశ్రీ  1008 జగద్గురు శ్రీ సిద్ధి రామ పండితారాధ్య శివాచార్య మహా స్వాముల వారికి    వీరశైవ లింగాయత్ సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు   చేరుకుని వచ్చిన జగద్గురువుకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ నాయకులు మాట్లాడుతూ సంగారెడ్డిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఎందుకు జగద్గురు విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మంగళవారం జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు పాల్గొని స్వాముల వారి ఆశీర్వాదం తీసుకోవాలని వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ నాయకులు ch బస్వరజ్ న్యాయవాది, శివచంద్ర పాటిల్ ( బాబుపటెల్),  సిద్దేశ్వర్ సులుగంటి, నాయికొటి రామప్ప, సంతోష్ పాటిల్  పెద్దరెడ్డిపెట్ తదితరులు పాల్గొన్నారు.