శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్
సంగారెడ్డి జిల్లా శాసనసభ కేంద్రమైన పట్టణ పరిధిలోని జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ శాంతి నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకలు జెకె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ గుంజేటి ఎంపీటీసీ బొమ్మ దేశెట్టి పాటిల్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు, ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీటీసీ దేశెట్టి పాటిల్ ని నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా బాల బాలికలు శ్రీకృష్ణ అవతారంలో నృత్య ప్రదర్శన చేయగా ముఖ్య అతిథి దేశెట్టి పాటిల్ ఆసక్తికరంగా తిలకించారు, ఈ సందర్భంగా ముఖ్య అతిథి దేశెట్టి పాటిల్ మాట్లాడుతూ 8 వ సంఖ్యకు శ్రావణమాసంలో కృష్ణ పక్షం వస్తుందని, వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టినరోజును కృష్ణష్టమి పేరు వచ్చిందని, ధ్వపార యుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5 వెయ్యిల సంవత్సరాల క్రితం మదురలో జన్మించారని ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని ఎంపిటిసి దేశెట్టి పాటిల్ అన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ విజయ్ రాథోడ్, సునీల్, రాజు, జగదీష్ సాగర్, రవికాంత్, దత్తు పాటిల్, శ్రీకర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు..