శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప స్వామి జాతర బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మల్దకల్ నవంబర్ 9 (జనంసాక్షి) జోగులంబ గద్వాల్ మల్డకల్ మండలం కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వచ్చేనెల జరిగే తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకలు (జాతర) బ్రోచర్లును ఎమ్మెల్యేబండ్ల కృష్ణమెహన్ రెడ్డి బుధవారము ఆవిష్కరించారు.
అనంతరం జాతర బ్రహ్మోత్సవాలు వేడుకలు  ఏర్పాట్ల గురించి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులతో కలిసి త్వరలో జరగబోయే జాతరను ఏ విధంగా నిర్వహించాలని చర్చించడం జరిగినది.ఎమ్మెల్యే  మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం లో ప్రసిద్ధి చెందిన మల్డకల్ తిమ్మప్ప స్వామి స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర కు  ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జాతర ఏర్పాట్లను పూర్తి చేయాలి ఎలాంటి ఏ చిన్న ఇబ్బంది కలవకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,ఎంపీపీ రాజారెడ్డి ,జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి,సింగిల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ వీరన్న,మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న ,మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి,సర్పంచ్ యాకోబు,వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న,మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, సర్పంచులు,ఎంపీటీసీలు తెరాస పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.