సంక్రాంతి కాదు ముఖ్యం సబే ముఖ్యం మంత్రి హరీష్ రావు. కూసుమంచి జనవరి 13 ( జనం సాక్షి ) : సంక్రాంతి పండుగ కంటే ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ ముఖ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పాలేరు నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల ప్రజా ప్రతినిధుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు స్థానంలో ఉన్నదని ఇట్లాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశం మొత్తం అమలు చేయాలని ఆలోచనతో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీని స్థాపించి పార్టీ సన్నాహక బహిరంగ సభను ఈనెల 18వ తేదీన ఖమ్మంలో ఐదు లక్షల జనంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మీదట ప్రతి నియోజకవర్గము నుంచి 50 వేల మంది జనం తక్కువ కాకుండా తరలించాలని దీనికి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పని చేయాలని పాలేరులో స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉన్నదని దానిని కార్యరూపంలో ప్రతి ఒక్కరూ కష్టపడి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
సంక్రాంతి కాదు ముఖ్యం సబే ముఖ్యం మంత్రి హరీష్




