Wednesday, 4 November 2026

సత్ఫలితాలు ఇవ్వని సర్వేలు

బడిఈడు పిల్లలు ఇంకా బడిబయటే ఉంటున్నారు 
వలసవాస్తున్న వారి పిల్లలతో పెరుగుతున్న సంఖ్య
హైదరాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నా బడి బయట పిల్లలు పుట్టుకొస్తూనే ఉన్నారు. సీఆర్పీలు ఇలాంటి బాలలు లేకుండా క్లస్టర్‌ స్థాయిల్లో పర్యవేక్షిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.  మరోవైపు వలసలు వస్తున్న వారి పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు బడులకు వెళ్లకుండా గ్రామాల్లో అధికంగా ఉండటం వల్ల బడి బయట పిల్లలు పుట్టుకొస్తున్నారన్న అభిప్రాయాలు  విద్యాశాఖలో వ్యక్తమవుతున్నాయి. సర్వేలు చేసి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం వరకే తప్ప వారిని బడిబాట పట్టించడాన్ని జిల్లాల్లోని విద్యాశాఖ పెద్దగా పట్టించుకోవడం లేదన్న స్తోందన్న విమర్శలున్నాయి.  గ్రామాల్లోని అన్ని పాఠశాలల్లో ఇలాంటి బాలల కోసం సదుపాయాలను కల్పిస్తూ రవాణా ఛార్జీలు, వివిధ పరికరాలను జిల్లా విద్యాశాఖ సమకూరుస్తున్నా  బాలలు బడిబాట పట్టడం లేదంటే లోపాలు ఎక్కడున్నాయో ఆశాఖ అధికారులు సవిూక్షించుకోవాల్సి ఉంది. ప్రైవేట్‌ వైపు మళ్లకుండా విద్యార్థులను సర్కార్‌ బడులకు ఆకర్శించాల్సిన అవసరం కూడా ఉంది.  వలసలకు వస్తున్న కుటుంబాల్లోని పిల్లలు, ప్రత్యేక అవసరాల బాలలు, బడులను అర్ధంతరంగా మానేస్తున్న బాలలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో గుర్తించే పక్రియ లేకపోవడంతో బడి బయట పిల్లలు ఏటా పెరుగుతున్నారు. బడి ఈడు వయసు గల బాలలంతా బడుల్లో అక్షరాలు నేర్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. బడులకు దూరంగా నిలుస్తున్న బాలలు ఏటా పుట్టుకొస్తూనే ఉన్నారు. పాఠశాలలకు వెళ్లని బాలలు వేల సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వివిధ కారణాలతో అర్ధాంతరంగా చదువులను మానేసిన బాలలు కూడా ఉంటున్నారు.. బడి ఈడు బాలలందరూ పాఠశాలల్లో ఉండేలా క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పర్యవేక్షించే అధికారులున్నా ఈ పరిస్థితి మారకపోవడం శోచనీయం. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు, వలసలు వంటి కారణాలతో వీరి సంఖ్య ఏటా పెరుగుతున్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మెప్మా, మహిళా సంఘాల సభ్యులు రెండు నెలల కిందట జిల్లాలో బడి బయట పిల్లలపై చేసిన సర్వేలో వేలాదిమంది బాలలు బడులకు దూరంగా ఉంటున్నట్లు తేలింది.. బడి ఈడు వయసు కలిగి బడులకు వెళ్లకుండా ఉంటున్న జిల్లాలోని బాలలను గుర్తించేందుకు 16 మండలాల్లో మెప్మా, మహిళా సంఘాల సభ్యులు సర్వేను రెండున్నర నెలల కిందట నిర్వహించారు. ఇటీవల ఈ సర్వే నివేదికను ఆ శాఖల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు అందజేయగా, వాటి వివరాలు జిల్లా విద్యా శాఖకు చేరాయి. ఆరేళ్ల వయసు నుంచి 15 ఏళ్లలోపు వయసు వరకు మొత్తం బాల, బాలికలు అనేకంది బడి బయట ఉన్నట్లు సర్వేలో తేల్చారు. వీరిలో 14 ఏళ్లలోపు వయసు గల బాలలే సగం మేరకు ఉన్నారు. గతంతో పోలిస్తే రెండు మూడేళ్ల కాలంలో  గ్రావిూణ, పట్టణ ప్రాంతాల్లో ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విద్యా సంస్థల సంఖ్య పెరగడంతో పాటు సదుపాయాలు మెరుగైన రీతిలో నిలుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటివి ఉచితంగానే ఇస్తుండగా, మండల కేంద్రాల్లో ఆదర్శ, కేజీబీవీలతో పాటు గురుకుల పాఠశాలలు అనేకం వెలిశాయి. ఇవన్నీ నెలకొన్నా నేటికీ ఇంకా బడులకు దూరంగా బాలలు నిలుస్తున్నారని సర్వే నివేదికల్లో వెల్లడవుతుండటం అందరినీ నివ్వెర పరుస్తోంది. సర్వేలోని బడి బయట గల పిల్లల వివరాలను పరిశీలిస్తూ విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే
వారిని బడుల్లో చేర్పిస్తామని, కుటుంబ పరిస్థితులను బట్టి అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలోనూ ప్రవేశాలను కల్పిస్తామని జిల్లా సర్వశిక్ష అభియాన్‌ అధికారులు అంటున్నారు. తాజాగా ఈయేడు కూడా బడిఈడు పిల్లలను గుర్తించి వారిని స్కూళ్లో చేర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంది.