సదస్సులను వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: నవీపేట మండలం నాడాపూర్‌, జన్నేపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు రాజు మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో పౌతీ కేసులు 10, సాదాబైనామా 9. భూసర్వేల కోసం 2 దరఖాస్థులు వచ్చినట్లు తహశీల్దారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ ఐ ప్రవీణ్‌కుమార్‌, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.