Tuesday, 3 November 2026

సమగ్ర సంరక్షణ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్

నాగార్ కర్నూల్ ఆర్సీ మే 02(జనంసాక్షి):నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ప్రాంగణంలో నాగర్ కర్నూల్ డివిజన్ పరిధిలోని ఏ.ఎన్.ఎమ్ లు మరియు ఆశా కార్యకర్తలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా.సుధాకర్ లాల్ ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నాగర్ కర్నూలు డివిజన్ పరిధిలోని ఏ.ఎన్.ఎమ్ లు,ఆశాలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు,ఈ కార్యక్రమంలో నోటి సంబంధిత వ్యాధులు,చేవి,ముక్కు,గొంతు సంబదిత వ్యాధులపై అవగాహన మరియు అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పించడం తో పాటు మానసిక రుగ్మతలకు గురయ్యే వారికి మరియు మత్తు పదార్థాలకు బానిసలు గా మారినవారికి ఏవిధంగా గుర్తించాలి,ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి,ఎలా వైద్య సహాయం అందించాలి అనే విషయాలను వివరంగా ఈ శిక్షణా ద్వారా నేర్పించడం జరుగుతుందన్నారు.వృదదాప్యంలో ఉండే లక్షణాలు ఏముంటాయి,ఎలా గుర్తించాలి,అనే వాటిమీద వారికి ఏ విధమైన వైద్య సహాయం అవసరమైన ఎలా స్పందించాలో అనే అంశాల మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకొని మీ పరిధిలోని ప్రజలకు అవగాహణ కల్పించి నాణ్యమైన వైద్య సహాయం,సేవలు అందించాలని సూచించారు.ఈ కార్య్రమంలో జిల్లా ఉప వైద్య మరియు అరోగ్య శాఖ అధికారి డా.వెంకట్ దాస్,డి.పి.ఎచ్.ఎన్.ప్రమీల,డి.పి.ఓ.రెనయ్య వైద్య అధికారులు వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.