Tuesday, 3 November 2026

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ జయంతి వేడుకలు

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో సావిత్రి బాయ్ జయంతి వేడుకలు

జహీరాబాద్( జనం సాక్షి) కోహిర్ మండలం లోని బాలికల ఉన్నంత పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 192వ జయంతికి కోహీర్ ఎస్సై, సురేష్, సమతా సైనిక్ దళ్ జిల్లా డివిజన్, మండలం అధ్యక్షులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అందరు కలిసి సాయి హిమ ద్విజ భువ ఫౌండేషన్ సహకారంతో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం విద్యార్థుల ఉపన్యాసాలు, పాటలు, నృత్యలతో విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించడం జరిగింది, ఎస్సై సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఎలాంటి ఆకతాయిలకు భయపడకుండా ఏ ఇబ్బందులు ఉన్నా 100కు ఫోన్ చేయవలసిందిగా ఎల్లప్పుడూ సి టీం మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. సమతా సైనిక్ దళ్ నాయకులు మాట్లాడుతూ 192 సంవత్సరాల క్రితం మహిళలకు మను ధర్మం పేరిట స్వేచ్ఛ, న్యాయం, సమానత్వంకల్పించకుండా మహిళలకు కేవలం వంటింటికి పడకగదికి మాత్రమే పరిమితం చేసి సమాజం అభివృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేసిన కూడా మూడ, విశ్వాసాల సంకెళ్లను తెంచి నాటి మహిళ జీవితాల్లో మహిళా సేవ మండలి, సత్యశోధక సమాజ్ సంస్థల ద్వారా వెలుగులు నింపిన క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే, ఈరోజు విద్యార్థులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం సంతోషం అని సావిత్రిబాయి పూలే సేవలను సమతా సైనిక్ దళ్ నాయకులు మాట్లాడుతూ యువతరానికి సందేశం ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళా ఉపాధ్యాయురాళ్లకు సన్మానించి, విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, డివిజన్ అధ్యక్షులు కర్ణం రవికుమార్, ఉపాధ్యక్షులు తుల్జారాం, కోశాధికారి నర్సింలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, శ్రీనివాస్, జైన్ సెక్రెటరీ, ప్రేమ్ కుమార్, రవి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.