Thursday, 5 November 2026

సమాజంలో అసమానతలు రూపుమాపాలి సీనియర్ సివిల్ జడ్జి భారతి

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని కోర్టులో భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్బంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు శనివారం సీనియర్ సివిల్ జడ్జ్ భారతి చేతుల మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. అంతకన్నా ముందు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ బారతి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భారత ప్రజలందరికి సమాన హక్కులు, భాధ్యత రాజ్యాంగంలో పొందుపరిచారని వీటిని ఉపయోగించుకుని సమాజంలో అసమానతలను రూపుమాపాలన్నారు. బార్ అసోషియేషన్ ఉపాద్యక్షులు రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని అంశాలను ప్రజలు తోలుకొని విజ్ఞాన వంతులు కావాలని,అంబేడ్కర్ కులరహిత సమాజం కొరకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ వాదులు కె.సదన్ కుమార్, శశిభూషణ్ కాచె పాల్గొన్నారు