హైదరాబాద్: సాంస్కృతిక వికాసం, సమాజసేవను సమన్వయం చేసుకుంటూ పనిచేయడమే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆశయమని అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇంటర్మీ డియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, పుట్టుకతోనే కంటి లోపాలుండే పిల్లలకు కంటి లోపాలుండే పిల్లలకు కంటి శస్త్ర చికిత్సలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఏడాది జూలై 4,5,6 తేదీల్లో అమెరికాలో నాటా ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలో వివిధ తెలుగు సంఘాలన్నీ భవిష్యత్తులో ఓకే వేదికపైకి వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు.




