Thursday, 5 November 2026

సమాజహితం కోసం కృషి చేసే వృత్తి జర్నలిజంప్రజలకు వాస్తవాలను చెప్పే భాద్యత జర్నలిస్టులది త్వరలో సంగారెడ్డి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు

.

 

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి,  ఏప్రిల్ 12ప్రజలకు వాస్తవాలను చెప్పే భాద్యత జర్నలిస్టులదని,ఆ దిశగా జర్నలిస్టులు పని చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు అన్నారు.
బుధవారం ఆందోల్ నియోజకవర్గమ్ లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి హరీష్ రావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ,అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బి బి పాటిల్, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ లతో కలిసి పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూతెలంగాణ ఉద్యమం లో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదన్నారు.
ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించి జర్నలిస్టులు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.
సమాజహితం కోసం కృషి చేసే వృత్తి జర్నలిజంమని,ప్రజలకు వాస్తవాలను చెప్పే భాద్యత జర్నలిస్టులదేనని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 12 వేల అక్రిడిటేషన్ జర్నలిస్టులు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో21,295 అక్రిడిటేషన్లు ఉన్నాయని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా100 కోట్లుజర్నలిస్టుల సంక్షేమ నిధిని ఇచ్చారని అన్నారు.
15 కోట్లతో మీడియా భవన్ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు.చనిపోయినజర్నలిస్టుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఫించన్ ఇచ్చి ఆదుకుంటున్నదని గుర్తుచేశారు.
తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజలకు తెలుపాలన్నారు.
ఆందోల్  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో  నియోజకవర్గం లోని  జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
ఇప్పటికే సిద్దిపేట,గజ్వేల్,మెదక్, జహీరాబాద్,నారాయణ్ ఖేడ్ లలో జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇచ్చామని,త్వరలో సంగారెడ్డి జర్నలిస్టులకు  ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు చొరవతో జర్నలిస్టులకు  ఇండ్ల స్థలాల ఇవ్వడం సాధ్యమైందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినజర్నలిస్టులకు  ఇండ్ల స్థలాల ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు కేటాయించిందని,దేశంలో ఎక్కడలేని విధంగా జర్నలిస్టులకు  కష్ట సుఖాలలో సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని,కరోనా లాంటి ఆపత్కాలంలో అన్ని విధాలా అండగావుంది పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.మీడియా భవన్ కట్టించిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.
తెలంగాణ లో20 వేల అక్రిడిటేడ్ జర్నలిస్టులు ఉన్నారని,ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బీ బి పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, అందరూ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,అదనపు కలెక్టర్ వీరారెడ్డి, టి.యు.డబ్లు.జె.యూనియన్  రాష్ట్ర కార్యదర్శి సాగర్,జర్నలిస్టులు,తదితరులు పాల్గొన్నారు.